ఇది ప్రత్యేకమైన ఉదయం ఫలహారం. వీటిని చేసుకోడానికి గుంతల పెనం మార్కెట్లో దొరుకుతుంది
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం- 1/2, కప్పు,
బియ్యం - 3/4 కప్పు,
మినప్పప్పు - 1/4 కప్పు,
మెంతులు - చిటికెడు,
పెరుగు -3 టేబుల్ స్పూన్లు,
శనగపప్పు- 1 టేబుల్ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,
అల్లం తరుగు - 1 టీ స్పూను,
ఉప్పు - రుచికి సరిపడా,
ఉల్లి తరుగు - కప్పు.
తయారు చేసే విధానము :
సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 7 గంటలు నానబెట్టాలి.
తర్వాత నీరు వడకట్టి పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి 7 గంటల సేపు పక్కనుంచాలి.
తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు, శనగపప్పుని (3 గంటలపాటు ముందు శనగపప్పు ని నానబోట్టుకోవాలి ) కలపాలి.
చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి.
ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి.
వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయ
ఇవి పుదీనా చట్నీతో , ఆలు కుర్మాతో తిన్నా బాగుంటాయి.