కారప్పొడి /నల్లకారం
తయారుచేయు విధానం :
మరి కొన్ని వంటలు : కొబ్బరి కారం , నువ్వుల కారం ,
కావలసిన పదార్దములు :
ఎండుమిర్చి : 15
ఉప్పు : సరిపడ
చింతపండు : నిమ్మకాయంత
జీలకర్ర : 1 Tbsp
వెల్లుల్లి రేకలు : పది
తయారుచేయు విధానం :
ముందుగా ఎండుమిర్చి తోడాలు తీసి పెట్టుకోవాలి ,తరువాత ఒక కళాయి లో నూనె వేసి కొంచం వేడి అయ్యాక ఎండుమిర్చి వేయించాలి. అదే నూనెలో జీలకర్ర కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు వేయించిన ఎండుమిర్చికి కొంచం ఉప్పు కలపి ,దీనిని నూరుకోవాలి (గ్రైండ్ ) తర్వాత చింతపండు వేసి మళ్ళీ నూరాలి. అలాగే ఎండిమిర్చి,చింతపండు నలిగిన తరువాత వెల్లుల్లి కూడా వేసి నూరాలి.
అంతే కారప్పొడి/నల్లకారం రెడీ .
ఈ నల్లకారం ఇడ్లీ ,దోస కి చాలా రుచిగా ఉంటుంది.
0 comments:
Post a Comment