పునుగులు
మరి కొన్ని వంటలు : మైసూర్ బజ్జి , మిర్చి బజ్జి , సమోసా ,వడలు , పకోడి
కావలసిన పదార్థాలు:
మినపప్పు - ఒక కప్పు,
బొంబాయి రవ్వ - ఒక కప్పు,
ఉల్లిపాయ - ఒకటి,
పచ్చిమిరపకాయలు - రెండు,
జీలకర్ర - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత,
సోడా - చిటికెడు,
నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
తయారుచేయు విధానం:
మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఓ గంట తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి.
అంతే పునుగులుతయారు కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.
0 comments:
Post a Comment