సొరకాయ అప్పాలు
బియ్యప్పిండి - 3 కప్పులు,
గింజలు లేని సొరకాయ తురుము - 1 కప్పు,
పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు,
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను,
కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూను,
కొత్తిమీర తరుగు - అరకప్పు,
నువ్వులు - 2 స్పూన్ల ,
జీలకర్ర - 2 స్పూన్ల
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేసి (అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలపండి ) చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేగించడానికి సరిపడా నూనె పోసి వేడిచేయండి ,నూనె వేడిఅయ్యాక
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ పేపరు మీద పలచగా పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి.
అంతే ఎంతో రుచిగా వుండే సొరకాయ అప్పాలు తయారు ..
అల్లం పచ్చడి (లేక )టొమాటో పచ్చడి వీటికి చాలా బావుంటుంది .
మరి కొన్ని వంటలు : చెక్క గారెలు , వడలు , మినప గారెలు
0 comments:
Post a Comment