Telugu Vantalu

మామిడికాయ తొక్కు పచ్చడి

0



మామిడికాయ తొక్కు పచ్చడి

కావలసిన పదార్థాలు :

మామిడికాయ - 1 cup తురిమినది

ఎండు మిరపకాయలు - 20

ఆవాలు - 2 tablespoons

మెంతులు - 1 tablespoon

ఇంగువ - చిటికెడు

నూనె
Mamidikaya Tokku Pachadi
పోపు కొరకు
ఆవాలు - 1 tablespoon

పచ్చి శెనగపప్పు - 1 tablespoon

జీల కర్ర - 1 teaspoon

తయారు చేసే విధానము
1 ముందుగ మామిడికాయ ముక్కలను తురిమి పక్కన పెట్టుకోవాలి.

2 ఎండు మిరపకాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఆవాలు, మెంతులను కూడా వేయించుకోవాలి.

ఎక్కువ వేగకుండా జాగర్త పడాలి. ఎక్కువ వేగితే పచ్చడి చేదు వస్తుంది.

ఇంగువ వేసుకొని అన్నిటిని కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

3 చేసుకొన్నా పొడిని, ఉప్పు ని మామిడికాయ తురుముతో కలుపుకోవాలి.

రోట్లో అయిన దంచుకోవచు లేదా grinder లో వేసి ఒకసారి తిప్పి కలపచ్చు

4 ఒక బాండలి లో నాలుగు గరిటెల నూనె పోసి కాగ పెట్టుకోవాలి.

నూనె వేడి చేసాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
Mamidikaya Tokku Pachadiఈ నూనె ని చేసుకొన్నా మామిడికాయ తురుములో కలుపుకోవాలి.

బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలాలి. ఎందుకంటే పచ్చడి నూనె ని మొత్తం పీల్చు కుంటుంది.

మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ.  

మరి కొన్ని వంటలు : మామిడి కాయ పప్పు , మామిడి కాయ పులిహోర ,మామిడికాయ పచ్చడి

0 comments:

Post a Comment