Telugu Vantalu

కట్టే పొంగలి / వెజ్ పొంగల్ :

0

కట్టే పొంగలి / వెజ్ పొంగల్ :

కావలసిన పదార్థాలు :
రైస్ - అర కిలో
పెసర పప్పు - పావు కిలో
మిరియాలు - 2 టీ స్పూన్లు
ఎండుమిర్చి - 6
ఆవాలు - 2 టీ స్పూన్లు
నెయ్యి - 4 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 2 రెబ్బలు

తయారు చేసే విధానము : 
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి . తరువాత బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టాలి .బాగా మెత్తగా ఉడికించు పక్కన పెట్టుకోండి . తరువాత నెయ్యిలో మిరియాలు ,ఎండుమిర్చి,ఆవాలు మరియు కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ ఉడకబెట్టిన అన్నం ,పప్పు ను అందులో కలపాలి ... అంతే కట్టే పొంగలి తయారు అయ్యింది , తినేఅప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది .


దీనికి కొబ్బరి వేయిచిన శనగపప్పు తో పచ్చడి చేసి అందులో నంచుకుని తింటే చాలా బావుంటుంది ..

మరి కొన్ని వంటలు :  కొబ్బరి అన్నం , టొమాటో రైస్ ,పుదీనా రైస్ ,జీరా రైస్ ,పప్పు బియ్యం 

0 comments:

Post a Comment