Telugu Vantalu



ఇది ప్రత్యేకమైన ఉదయం ఫలహారం. వీటిని చేసుకోడానికి గుంతల పెనం మార్కెట్లో దొరుకుతుంది

కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం- 1/2, కప్పు,
బియ్యం - 3/4 కప్పు,
మినప్పప్పు - 1/4 కప్పు,
మెంతులు - చిటికెడు,
పెరుగు -3 టేబుల్ స్పూన్లు,
శనగపప్పు- 1 టేబుల్ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,
అల్లం తరుగు - 1 టీ స్పూను,
ఉప్పు - రుచికి సరిపడా,
ఉల్లి తరుగు - కప్పు.

తయారు చేసే విధానము :
 సగ్గుబియ్యం, మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి 7 గంటలు నానబెట్టాలి.
 తర్వాత నీరు వడకట్టి  పెరుగు, ఉప్పు కలుపుతూ చిక్కగా రుబ్బి 7 గంటల సేపు పక్కనుంచాలి. 
తర్వాత కొత్తిమీర, ఉల్లి తరుగు,  శనగపప్పుని (3 గంటలపాటు  ముందు శనగపప్పు ని నానబోట్టుకోవాలి ) కలపాలి. 
 చిన్న కడాయిలో కొద్ది నూనె వేసి ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి తరుగు తాలింపు వేసి చల్లారాక రుబ్బిన పిండిలో కలపాలి. 
ఈ మిశ్రమాన్ని (స్పూను చొప్పున నూనె వేసిన) పెనం గుంతల్లో మూడు వంతులు నింపి మూతపెట్టాలి. 


 వేగాక సన్న కాడతో తిప్పుతూ అన్నివైపులా దోరగా వేగించాలి. ఈ పొంగనాలని కొబ్బరిచట్నీతో తింటే చాలా బాగుంటాయ

ఇవి పుదీనా చట్నీతో , ఆలు కుర్మాతో తిన్నా బాగుంటాయి.

మరి కొన్ని వంటలు :  పునుగులు    ,   మైసూర్ బజ్జి   ,వడలు , పకోడి

పుదీనా రసం 


వేసవికాలం వస్తుంది .ఈ కాలంలో ఎక్కువ మనం నీళ్లనే తీసుకుంటాము . సూర్యడు వేడి ని తట్టుకోవటానికి , మన శరీరానికి శక్తీ ఇవ్వటానికి పళ్లరసాలు చాల మంచివి . శీతలపానీయాల బదులుగా మన ఇంట్లోనే ఎన్నో రకాల పళ్లరసాలును మరియు ఆరోగ్యకరమయిన పానీయాలను తయారుచేసుకోవచ్చు .


వాటిలో ఒకటి ఈ రోజు

పుదీనా రసం 

కావలసిన పదార్థాలు : నిమ్మకాయలు - పది, పంచదార - ఐదు కప్పులు, పుదీనా పెద్ద కట్టలు - రెండు, అల్లం - చిన్నముక్క, నల్లఉప్పు - పెద్దచెంచా.

తయారు చేసే విధానము :  
Summer Special Mint Juice

ఓ గిన్నెలో పంచదార , కప్పున్నర నీళ్లూ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి ముదురుపాకంలోకి మారుతున్నప్పుడు దింపేయాలి. అది చల్లారాక అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు పుదీనా ఆకులూ, అల్లం, నల్ల ఉప్పు మిక్సీజారులోకి తీసుకుని ముద్దలా చేయాలి. దీన్ని చక్కెర పాకంలో కలిపి వడకట్టాలి. ఈ రసాన్ని ఒక గాజు లేదా ప్లాస్టిక్‌ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. కావల్సిననప్పుడల్లా గ్లాసు చన్నీళ్లలో ఈ మిశ్రమాన్ని రెండుమూడు చెంచాలు కలిపి తాగొచ్చు. ఇది వారం వరకూ నిల్వ ఉంటుంది

ఆరోగ్యానికి చాల మంచిది పుదీనా రసం.

మరికొన్ని రసాలు :  స్వీట్ లస్సి ,కెసర్ పిస్తా మిల్క్ షేక్ ,మ్యాంగో లస్సీ , రోజ్ మిల్క్ షేక్
ఉసిరికాయ పచ్చడి
 కావలసినవి
ఉసిరికాయలు: అరకిలో, రాతిఉప్పు: ఒకటిన్నర కప్పులు, ఇంగువ: టీస్పూను, నువ్వులనూనె: ఒకటిన్నర కప్పులు, ఆవపొడి: 3 టేబుల్‌స్పూన్లు, కారం: ఒకటిన్నర కప్పులు, జీలకర్ర: టీస్పూను, మెంతిపొడి: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, నిమ్మకాయలు: 4

తయారుచేసే విధానం
* ఉసిరికాయల్ని కడిగి పొడిబట్టతో తుడిచి ఎక్కడా తడి అంటకుండా కాసేపు ఎండనివ్వాలి. కాయలకు నిలువుగా గాట్లు పెట్టి ఉంచాలి.
* రాతి ఉప్పుని మెత్తగా దంచాలి. తరవాత కాయల్ని ఓ జాడీలో వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలిపి రెండుమూడు రోజులు వూరనివ్వాలి. కాయ ­రి పచ్చడిలో నీళ్లు వస్తాయి. ఇప్పుడు గరిటెతో బాగా కలపాలి. తరవాత బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి ఓ క్షణం మరిగించి దించాలి. నూనె బాగా ఆరిన తరవాత పచ్చడిలో కలిపి నిమ్మరసం పిండి ఉప్పు సరిచూడాలి

మరి కొన్ని వంటలు : మెంతి ఆవకాయ ,మాగాయ ,నువ్వుల ఆవకాయ  ,పండుమిర్చి పచ్చడి
చక్ర పొంగలి
కావలసిన పదార్థాలు :
రైస్ - అర కిలో (పాతవి)
పెసర పప్పు - పావు కిలో
ఎండు కొబ్బరి - 1 చిప్ప
బెల్లం - అర కిలో
జీడిపప్పు - 50 గ్రా
యాలకులు - 8 /9
నెయ్యి - పావు కేజీ


తయారు చేసే విధానము :
ముందుగా బియ్యం మరియు పెసర పప్పు కలిపి కడిగి , పొడిగా ఉండేట్లు వండి వార్చుకోవాలి ,బెల్లం తరిగి సన్నగా తీగ పాకం వచ్చేట్లు చేసుకోవాలి ఎండు కొబ్బరి సన్న ముక్కలు గా తరగాలి ,యాలకులు పొడి చేసి పాకంలో వేయాలి .

ఈ పాకం లో వండిన అన్నం వేసి బాగా కలిపి ఒక 10 నిముషాలు సన్నని సెగ పైన ఉడికించి దించుకోవాలి .

ఇప్పుడు ఒక మూకుడు లేదా గిన్ని లో నెయ్యి వేసి కాగిన తరువాత ఎండు కొబ్బరి సన్న ముక్కలు ,జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి

పొంగలి లో వేసి కలపాలి .

అంతే వేడి వేడి చక్ర పొంగలి తయారు


మరి కొన్ని స్వీట్స్  :  పాలకోవా , కోవా కజ్జికాయలు , లడ్డు ,రవ్వ లడ్డు ,మైసూరు పాక్
పూర్ణం బూరెలు
కావలసిన పదార్థాలు  :
శనగపప్పు - ముప్పావు కప్పు
బెల్లం - ఒక కప్పు
తాజా కొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు
బియ్యంపిండి - ఒకటిన్నర కప్పు, నీళ్లు - తగినన్ని

నెయ్యి - 1 టీ స్పూన్‌, ఉప్పు - చిటికెడు

తయారుచేసే విధానం:

 శనగపప్పు మునిగేంత వరకు  నీరు పోసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా వేళ్లతో నొక్కితే చితికేంత మేరకే ఉడికించుకోవాలి. తడిలేకుండా చూసుకోవాలి. తర్వాత పప్పును చల్లార్చి పొడి చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టాలి. పాకంలో శనగపప్పు పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకూ సన్నని మంటపై ఉడికించుకోవాలి. మిశ్రమం పిండి ముద్దగా మారాక మంట తీసేయాలి. పూర్తిగా చల్లారాక ఉండలు కట్టుకుని పక్కనుంచుకోవాలి. నీళ్లు, నెయ్యి, ఉప్పు కలిపి మరిగించుకోవాలి. బియ్యంపిండిని ఓ గిన్నెలో తీసుకుని మరిగించిన నీటిని చేర్చుతూ పిండి కలుపుకోవాలి. 2 నిమిషాలాగి వేడిగా ఉన్నప్పుడే పిండి మెత్తబడే వరకూ పిసుక్కోవాలి. చేతికి నూనె పూసుకుని పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఉండలను చేత్తో చిన్న పూరీల్లా వత్తుకుని వాటి మధ్యలో శనగ ఉండను ఉంచి గుండ్రంగా చుట్టాలి. ఇలా తయారుచేసిపెట్టుకున్న కుడుములను 10 -12 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించి చల్లారాక వడ్డించాలి.

మరి కొన్ని వంటలు : 
సేమ్యా పులిహోర 
కావలసిన పదార్దాలు

సేమ్యా- కప్పు,
చింతపండు - నిమ్మకాయంత
శనగపప్పు - టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్,
జీడిపప్పు - 4 పలుకులు
ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్
ఇంగువ - చిటికెడు,
కరివేపాకు - రెమ్మ,
ఉప్పు - రుచికి సరిపడేంత
ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 4,
నూనె - 3 టీ స్పూన్లు


తయారు చేసే విధానము

ముందుగా తగినన్ని నీళ్లు పోసి  చింతపండు నానబెట్టుకోవాలి . ఇప్పుడు కొద్దిగా  నీళ్లు పోసి  సేమ్యాను ఉడికించి, వార్చి, వెడల్పాటి ప్లేట్‌లో వేసి, విడదీసి ఆరనివ్వాలి.ఇప్పుడు  నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పువేసి, ఉడికించి, చల్లారనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జును, ఉడికించినా సేమ్యాకు పట్టించి, పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సమంగా వేగనివ్వాలి. చివరిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి .
ఈ పోపును  పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలిపి . 
అంతే   సేమ్యా పులిహోర తయారు 

మరి కొన్ని వంటలు : రవ్వ పులిహోర , చింతపండు పులిహోర , నిమ్మకాయ పులిహోర 
గుత్తి వంకాయ కూర
కావలసిన పదార్థాలు
వంకాయలు - 5
ఉల్లిపాయలు - 1 పెద్దది సన్నగా తరిగినది
టమోటాలు - 2 సన్నగా తరిగినది
చింతపండు - 2 నిమ్మకాయంత
వేరుశెనగపప్పు - 15 - 20
తరిగిన పచ్చి కొబ్బరి - 1 /2 cup
వెల్లుల్లి - 4 - 5
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 teaspoon
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
ఆవాలు
మెంతులు
జీలకర్ర
ఎండు మిర్చి - 4
నూనె

తయారు చేసే విధానము
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి. మొత్తం కోయకూడదు.

ఇప్పుడు మధ్యలో వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు (వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ  విధానము  కోసం కింద చూడండి ) ని  కూర్చుకొని  పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చింతపండు ని వేడి నీళ్ళల్లో ఐదు నిముషాల పాటు నాన పెట్టాలి. తరువాత  చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి , ఉల్లిపాయలు కొంచం  వేగిన  తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.

అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి.
ఇప్పుడు చేసుకొన్న చింతపండు రసం ని కూడా వేసుకోవాలి.
అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి 2 నిముషాల తరువాత  వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు ని  కూర్చుకొని  వంకాయలను  కూడా వేసుకోవాలి ,
దీనిని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.

అంతే గుత్తి వంకాయ కూర తయారు

 వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ  విధానము 


ముందుగ వేరుశెనగపప్పు ని ఒక పాన్ లో వేయించుకోవాలి,చివరిలో  ఎండు మిర్చి ని కూడా  వేసి వేయించి దించేయాలి ,వేరేగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూడా వేసి వేగించుకోవాలి. 


ఇప్పుడు వేగించుకున్న వాటిని మరియు , వెల్లుల్లి, ఉప్పు , పచ్చి కొబ్బరి కూడా వేసి కొంచం నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇదే  వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు

మరి కొన్ని వంటలు :  కాప్సికం మసాలా కూర , బంగాళాదుంప మాసాల కూర , 

పునుగులు 
కావలసిన పదార్థాలు: 
మినపప్పు - ఒక కప్పు, 
బొంబాయి రవ్వ - ఒక కప్పు,
 ఉల్లిపాయ - ఒకటి,
 పచ్చిమిరపకాయలు - రెండు,
 జీలకర్ర - ఒక టీ స్పూను,
 ఉప్పు - తగినంత, 
సోడా - చిటికెడు, 
నూనె - సరిపడా.


తయారుచేయు విధానం: 
మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 
ఓ గంట తర్వాత పొయ్యి మీద కళాయి   పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. 
అంతే పునుగులుతయారు  కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.

మరి కొన్ని వంటలు :  మైసూర్ బజ్జి  , మిర్చి బజ్జి , సమోసా  ,వడలు  , పకోడి

కారప్పొడి /నల్లకారం

కావలసిన పదార్దములు : 
ఎండుమిర్చి : 15
 ఉప్పు : సరిపడ 
చింతపండు : నిమ్మకాయంత
 జీలకర్ర : 1 Tbsp
 వెల్లుల్లి రేకలు : పది 
 నూనె : రెండు Tbsp


తయారుచేయు విధానం : 
ముందుగా  ఎండుమిర్చి తోడాలు తీసి పెట్టుకోవాలి ,తరువాత ఒక కళాయి  లో నూనె వేసి కొంచం  వేడి అయ్యాక  ఎండుమిర్చి వేయించాలి. అదే నూనెలో జీలకర్ర కూడా వేసి వేయించాలి. 
ఇప్పుడు వేయించిన ఎండుమిర్చికి కొంచం ఉప్పు కలపి ,దీనిని నూరుకోవాలి (గ్రైండ్ )  తర్వాత చింతపండు వేసి మళ్ళీ నూరాలి. అలాగే ఎండిమిర్చి,చింతపండు నలిగిన తరువాత వెల్లుల్లి కూడా వేసి నూరాలి. 
అంతే  కారప్పొడి/నల్లకారం రెడీ  . 
ఈ నల్లకారం ఇడ్లీ ,దోస కి చాలా రుచిగా ఉంటుంది.

మరి కొన్ని వంటలు : కొబ్బరి కారం , నువ్వుల కారం , 
క్యారెట్ హల్వా

Carrot Halwaకావలసిన పదార్థాలు: 
క్యారెట్ తురుము   -450g
పాలు -850ml
పంచదార -125g
యాలకులు  -3
ఎండు ద్రాక్ష -2 టేబుల్ స్పూన్స్
పిస్తా పప్పు సన్నగా కోసినవి -2 టేబుల్ స్పూన్స్
జీడి పప్పు - 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి -4 టేబుల్ స్పూన్స్
కుంకుమ పువ్వు - చిటికెడు



తయారు చేయు విధానం :-
ముందుగా పొయ్య వెలిగించి దానిమీద ఒక గిన్నె పెట్టి అందులో  పాలు,క్యారెట్ తురుము,పంచదార, యాలకులు పొడి, కుంకుమ పువ్వు వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా అడుగు అంట  కుండా  పాలు అంతా ఇగిరేవరకు ఉడకనివ్వాలి. ఇంకో  పొయ్య మీద ఒక బాణి  పెట్టి కొంచం నెయ్యి వేసి వేడి అయినా  తరువాత పిస్తాపప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కొంచెం వేగనిచ్చి, అందులో ఉడకపెట్టిన క్యారెట్ ముద్ద వేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి
అలా ఆ క్యారెట్  ముద్ద ని  ఎరుపురంగు వచ్చి నెయ్యి పైకి తేలేలా ఉడకనివ్వాలి. 
 క్యారెట్ హల్వా రెడి . 

మరి కొన్ని వంటలు : బాదాం  హల్వా  ,రవ్వ కేసరి .