Telugu Vantalu

జీడిపప్పు పకోడీ

0
జీడిపప్పు పకోడీ :
కావలసిన పదార్థాలు :
Jeedipappu Pakoda
శనగపిండి -పావుకేజీ
పొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు -నాలుగు
జీడిపప్పులు -రెండు వందల గ్రాములు
బియ్యం పిండి -రెండు టేబుల్ స్పూన్స్
అల్లం -రెండు అంగుళాల ముక్క
కొత్తిమీర -అయిదు రెమ్మలు
కరివేపాకు -మూడు రెమ్మలు
వాము -ఒక టీ స్పూన్
కారం -ఒక టీ స్పూన్ ఉప్పు -తగినంత
నూనె -వేయించుకోడానికి సరిపడా



తయారు చేసే విధానము : 

కొత్తిమీరను ,కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
అల్లంను తొక్క తీసి చిన్నగా తరిగిపెట్టుకోవాలి.
ఒకగిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో జీడిపప్పును పదినిమిషాలు నానబెట్టుకోవాలి.
ఇలా చేసుకోవడంవలన వేయిన్చుకునేప్పుడు జీడిపప్పుమాడకుండా ఉంటుంది.
Jeedipappu Pakodaఒకవెడల్పాటి గిన్నెతీసుకుని అందులో శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి
అందులోబియ్యంపిండి కూడా వేసుకోవాలి.ఈబియ్యంపిండి వెయ్యడం వలన
పకోడీలు కరకరలాడుతాయి. 
తర్వాతపొడవుగా సన్నగా తరిగిన ఉల్లిముక్కలు వేసుకోవాలి. 
కట్చేసిన కరివేపాకును వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి . 
పొడిగా ఒకసారి బాగా కలపాలి తరువాత వాము,కారం,తగినంతఉప్పు వేసుకోవాలి
నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి.
గట్టిగా కలిపితే జీడిపప్పులు పగిలిపోతాయి .
కొంచెంకొంచెం నీళ్ళు పోసుకుంటూ పకోడిలా పిండిమాదిరి గట్టిగ కలుపుకోవాలి స్టవ్వెలిగించి నూనెపోసికా
బాండికి సరిపడా పకోడిలా మిశ్రంను తీసుకుని వేసుకోవాలి. హైఫ్లేమ్లోపెట్టికుని వండుకోవాలి.అప్పుడునూనెపీల్చుకోవు.మద్యమద్యలో
కలియతిప్పుకుంటూ బంగారు గోధుమ రంగులో వచ్చేవరకు వేయించుకోవాలి
అంతే జీడిపప్పు పకోడీ తయారు

మరి కొన్ని వంటలు :  పాల కూర cutlet , పావ్ భాజీ , వెజిటబుల్ పకోడా ,మసాల వడ

0 comments:

Post a Comment