Telugu Vantalu

టమాటో రసం

0

టమాటో రసం 
కావలసిన పదార్థాలు :
టమోటాలు - 3
మిరియాలు
ఆవాలు - 1 teaspoon
పచ్చి శెనగ పప్పు - 1 teaspoon
వెల్లుల్లి రెప్పలు - 3 దంచినవి
పసుపు - చిటికెడు
ఉప్పు
నూనె

తయారు చేసే విధానము :
ముందుగ టమోటా ను పెద్ద ముక్కలుగా చేసి ఒక గిన్నె లోకి తీసుకోవాలి. అందులో కొంచం నీళ్ళు పోసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
బాగా ఉడికాక మంట ఆపేసి టమోటాలు చల్లారాక తోకకు తీసి టమోటా ముక్కలను, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తగా పేస్టు చేసుకోవాలి.
ఈ పేస్టు ని గిన్నె లో ఉన్న మిగతా నీళ్ళల్లో కలిపి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మరల పొయ్యి మీద పెట్టి ఉడికించాలి.
ఈ లోపు వేరే పాన్ లో కొద్దిగా నూనె పోసుకొని అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.
ఈ తిరగమాత ను చేసుకొన్నా రసం లోకి కలుపుకోవాలి.
టమాటో రసం

మరి కొన్ని వంటలు : టమాటో పప్పు ,టమాటో పచ్చడి ,టొమాటో కూర 

0 comments:

Post a Comment