Telugu Vantalu

కాకరకాయ కారం

0
కాకరకాయ కారం :

కావలసిన పదార్థాలు...
కాకరకాయలు : అర కేజీ
కారం : 4 చెంచాలు
ఉప్పు : తగినంత
పసుసు : చిటికెడు
కరివేపాకు : 2 రెబ్బలు
తాళింపు దినుసులు : 2 టీ స్పూన్లు
నూనె : వేయించడానికి సరిపడా
కొబ్బరిపొడి : 200 గ్రా


తయారు చేసే విధానం...
ముందుగా కాకరకాయలు ముక్కలుగా కోసి కొద్దిగా నీళ్ళు ఉప్పు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ముక్కలను ఎండలో రెండు గంటల సేపు ఎండబెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద  మూకుడు  పెట్టి నూనె  వేసి ,మరిగిన తర్వాత  తాలింపు పెట్టి తరువాత   కాకరకాయ ముక్కలు వెయ్యాలి, కొంచం ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఎండుకొబ్బరి పొడి 4 చెంచాలు వెయ్యాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసి దించుకోవాలి.

మరి కొన్ని వంటలు :  దొండకాయ కారం , దోసకాయ కారం , 



0 comments:

Post a Comment