Telugu Vantalu

బీన్స్ వేపుడు

0

బీన్స్ వేపుడు

కావలసిన పదార్థాలు :

బీన్స్ - 1 cup ఉడక పెట్టి చిన్న ముక్కలుగా చేసినవి

ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది

ఆవాలు - 1 tablespoon

పచ్చి శెనగపప్పు - 2 tablespoons


జీల కర్ర - 1 tablespoon

ఎండు మిరపకాయలు - 3

వెల్లుల్లి రెప్పలు - 5 దంచినవి

కొబ్బరి పొడి - 2 tablespoons

నూనె

తయారు చేసే విధానము :
ముందుగ బీన్స్ ఉడక పెట్టి నీళ్ళు వడార్చి పక్కన పెట్టుకోవలెను.

ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.

అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు, జీల కర్ర వేసి వేయించాలి. వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఆఖరున ఎండు మిరపకాయలు కూడా వేసి ఒక నిముషం పాటు వేయించాలి.

అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

వేగాక ఉడక పెట్టుకొన్న బీన్స్ ని వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసి  బాగా కలిపి దించేయాలి.

 బీన్స్ ప్రై  రెడీ.
మరి కొన్ని వంటలు : బీన్స్ క్యారెట్ కూర 

0 comments:

Post a Comment